పంజాబ్‌లో ఎన్నికలు ఆపాలంటూ సీఎం డిమాండ్‌.. లేదంటే 20 లక్షల మంది..

Punjab: పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆ రాష్ట్ర సీఎం, కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

Update: 2022-01-17 08:39 GMT

పంజాబ్‌లో ఎన్నికలు ఆపాలంటూ సీఎం డిమాండ్‌.. లేదంటే 20 లక్షల మంది..

Punjab: పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆ రాష్ట్ర సీఎం, కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. గురురవిదాస్ జయంతి వేడుకల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు కోరిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకు వెళ్లారు.

ఉత్తరప్రదేశ్ లోని బెనారస్ లో ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు జరగనున్న గురురవిదాస్ జయంతి వేడుకలకు పంజాబ్ నుంచి దాదాపు 20 లక్షల మంది వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే వారంతా తమ ఓటు హక్కు వినియోగించుకోలేరని కనీసం ఆరు రోజుల పాటు వాయిదా వేయాలని ఈసీకి లేఖ రాశారు. 

Tags:    

Similar News