పబ్జీ ప్రియులకు శుభవార్త.. త్వరలో తిరిగి వచ్చే అవకాశం!
గాల్వాన్ వ్యాలీలో చైనా దురాగతానికి 20 మంది భారత సైనికులు మరణించారు. దాంతో చైనాకు బుద్ధి చెప్పాలనుకుంది భారత్.. అందులో భాగంగా ..
గాల్వాన్ వ్యాలీలో చైనా దురాగతానికి 20 మంది భారత సైనికులు బలయ్యారు. దాంతో చైనాకు బుద్ధి చెప్పాలనుకుంది భారత్.. అందులో భాగంగా 118 చైనా యాప్స్‌ను ఈ మధ్యే బ్యాన్ చేసింది. వీటిలో ఎంతో పాపులర్ గేమ్ అయిన పబ్జీ మొబైల్ కూడా ఉంది. భారత్ లో ఈ ఆన్ లైన్ గేమ్ కు మంచి ఆదరణ ఉంది..నిజానికి ఇది చైనా గేమ్ కాదు.. దక్షిణకొరియాకు చెందినది.. ఈ గేమ్ పంపిణీకి చైనాకు చెందిన టెక్ దిగ్గజం టెన్‌సెంట్‌తో.. దక్షిణ కొరియాకు చెందిన పబ్జీ కార్పొరేషన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందమే పబ్జీ మొబైల్ గేమ్ పాలిట శాపమైంది. చైనాతో ఒప్పందం చేసుకోవడం వల్ల దీనిని చైనా యాప్ గా గుర్తించి బ్యాన్ చేసింది. ఈ క్రమంలో ఈ గేమ్‌ను తిరిగి వెనక్కి తీసుకురావడం కోసం టెన్‌సెంట్ సంస్థతో ఒప్పందాన్ని పబ్జీ రద్దు చేసుకుంది.
ఇకపై టెన్సెంట్ కు అధికారం ఇవ్వబోమని దక్షిణ కొరియా పబ్జీ కార్పొరేషన్ తెలిపింది. అంతేకాదు ఇకనుంచి అన్ని బాధ్యతలను పబ్జీ కార్పొరేషన్ తీసుకుంటుందని కంపెనీ తెలిపింది. గేమర్స్ మరోసారి యుద్ధభూమిలోకి దిగడానికి వీలుగా ఒక పరిష్కారాన్ని కనుగొనటానికి భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నట్లు కార్పొరేషన్ తెలిపింది. భారతదేశం నియమ నిబంధనలను పూర్తిగా పాటించాలని.. భారత్ లో మళ్ళీ ఈ గేమ్ ను అందుబాటులోకి తేవాలని.. కార్పొరేషన్ దీనిని సాధ్యం చేయాలని కోరుకుంటుంది. దీంతో ఈ గేమ్ మళ్లీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు గత వారం రోజులుగా ప్రభుత్వంతో కంపెనీ చర్చలు జరుపుతోంది.