Maharashtra Badlapur: బద్లాపూర్ లో చిన్నారులపై లైంగికదాడి ఘటనపై ఆందోళనలు, పోలీసులపై రాళ్లదాడి

బద్లాపూర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో మూడు, నాలుగేళ్ల వయస్సున్న చిన్నారులు నర్సరీ చదువుతున్నారు. ఆగస్టు 16న వీరిద్దరూ టాయిలెట్ కు వెళ్లిన సమయంలో టాయిలెట్ క్లీన్ చేసే 23 ఏళ్ల యువకుడు వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

Update: 2024-08-20 13:20 GMT

Maharashtra Badlapur: బద్లాపూర్ లో చిన్నారులపై లైంగికదాడి ఘటనపై ఆందోళనలు, పోలీసులపై రాళ్లదాడి

మహారాష్ట థానే బద్లాపూర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నర్సరీ చదివే ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ . ఈ ఘటనపై స్థానికులు రైల్వేట్రాక్ పై నిలబడి ఆందోళనకు దిగారు. రాళ్లతో దాడి చేశారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్గించారు. ఈ ఆందోళనతో టెన్షన్ నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.


 బద్లాపూర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఏం జరిగింది?

బద్లాపూర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో మూడు, నాలుగేళ్ల వయస్సున్న చిన్నారులు నర్సరీ చదువుతున్నారు. ఆగస్టు 16న వీరిద్దరూ టాయిలెట్ కు వెళ్లిన సమయంలో టాయిలెట్ క్లీన్ చేసే 23 ఏళ్ల యువకుడు వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఓ బాలిక ఈ విషయాన్ని పేరేంట్స్ కు చెప్పడంతో విషయం వెలుగు చూసింది.

స్కూల్ ప్రిన్సిపల్ పై సస్పెన్షన్ వేటు

ఈ ఘటన బయటకు రావడంతో స్కూల్ ప్రిన్సిపల్ తో పాటు ఇద్దరు టీచర్లు, ఒక్క అటెండెంట్ పై యాజమాన్యం చర్యలు తీసుకుంది. బాధితుల పేరేంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 16న కేసు నమోదు చేశారు. తొలుత పోలీసులు సరిగా వ్యవహరించలేదని బాధితుల పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. స్కూల్ లో చాలా చోట్ల సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదు. బాలికల టాయిలెట్స్ క్లీనింగ్ కోసం మహిళా వర్కర్లు లేని విషయం లేని గుర్తించారు.


 పేరేంట్స్ ఆందోళనతో బద్లాపూర్ లో టెన్షన్

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 20న బద్లాపూర్ రైల్వేస్టేషన్ వద్ద రైల్వే ట్రాక్ పై నిలబడి స్థానికులు ఆందోళన చేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాళ్లతో దాడి చేశారు. అంతకుముందు స్కూల్ పై దాడి చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.

సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

ఈ ఘటనను ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విచారణకు సిట్ ను ఏర్పాటు చేసింది. స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. స్కూళ్లలో విద్యార్ధినుల రక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పశ్చిమబెంగాల్ లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా అట్టుడుకుతున్న తరుణంలో మహారాష్ట్రలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

Tags:    

Similar News