Narendra Modi: నరేంద్ర మోడీతో భేటీ అయిన వియత్నాం ప్రధాని చిన్హ్
Narendra Modi: పలు అంశాలపై ఒప్పందాలు చేసుకున్న ఇరుదేశాధినేతలు
Narendra Modi: చైనాతో సరిహద్దు వివాదం జరుగుతున్న వేళ... వియత్నాంతో సంబంధాలను మరింత బలపరుచుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా రెండ్రోజుల భారత్ పర్యటనకు వచ్చిన వియత్నాం ప్రధాని ఫామ్‌మిన్ చిన్హ్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య పలు అంశాలపై ఒప్పందాలు జరిగాయి. ప్రపంచంలోని అగ్రదేశాల్లో ఒకటిగా భారత్ నిలిచిందని... అది ప్రధాని మోడీ నాయకత్వంలో సాధ్యమైందన్నారు వియత్నాం ప్రధాని. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించిందని కొనియాడారు. రెండు దేశాలూ స్వేచ్ఛా, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్ కోసం పని చేస్తాయని... తాము విస్తార్‌వాద్‌కు కాకుండా... వికాస్‌వాద్‌కి మద్దతు ఇస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు.