Prime Minister Modi's Speech: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Pm Modi's speech: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం ప్రసంగించారు.

Update: 2024-08-15 03:07 GMT

Prime Minister Modi's Speech: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Pm Modi's speech: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడక ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. వరుసగా ఇది 11వ సారి ఆయన ప్రధానమంత్రిగా జెండా ఎగురవేశారు. ఈ వేడుకలకు సుమారు 6 వేల మంది అతిథులు హాజరయ్యారు. అంతముందు ప్రధానమంత్రి రాజ్ ఘాట్ దగ్గర మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.

దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని ప్రధాని మోదీ ఈ సందర్బంగా తెలిపారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిపోయింది. దేశం కోసం జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎంతో మంది ఉన్నారు. ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉంది. స్వాతంత్ర్యం కోసం ఆరోజుల్లో 40కోట్ల మంది ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. భారతదేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. భారత్ ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని..తయారీ రంగంలో గ్లోబల్ హబ్ గా చేయలన్నారు ప్రధాని మోదీ.

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, 'భారతదేశంలోని 18 వేల గ్రామాలకు నిర్ణీత సమయంలో విద్యుత్ అందిస్తామని చెప్పారు. ఇది ప్రజల విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇది దేశానికి స్వర్ణ కాలం, ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదంటూ ప్రధాని అన్నారు.

ఎర్రకోట ప్రాకారం నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించే ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌కు చేరుకుని.. . ఈ సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రధాని ఎర్రకోటకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన గార్డ్ ఆఫ్ ఆనర్‌ను పరిశీలించారు. అనంతరం మోదీ ఎర్రకోట ప్రాకారంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 


Tags:    

Similar News