PM Modi: ఏపీ, తెలంగాణ విభజనపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
PM Modi: నూతన రాష్ట్రం వచ్చినా తెలంగాణ వేడుకలు జరుపుకోలేకపోయింది
PM Modi: ఏపీ, తెలంగాణ విభజన సరిగా జరగలేదంటూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోడీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన రాష్ట్రం వచ్చినా తెలంగాణ వేడుకలు జరుపుకోలేకపోయిందని మోడీ వ్యాఖ్యానించారు. ఈ విభజన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వర్గాలకు సంతృప్తి కలిగించలేకపోయిందన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో కష్టంతో జరిగిందని, రక్తం చిందించాల్సి వచ్చిందన్నారు. పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోడీ లోక్ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంలో ఏపీ, తెలంగాణ విభజనపై ప్రధాని మోడీ మాట్లాడారు.