PMGKY: నవంబర్‌ తర్వాత ఉచిత రేషన్‌ నిలిపివేత..! కారణం ఇదే..

PMGKY: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజలను ఆదుకోవాలని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రారంభించారు.

Update: 2021-11-01 15:30 GMT

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (ఫైల్ ఇమేజ్)

PMGKY: కరోనా మహమ్మారి వల్ల గత కొన్ని రోజులుగా దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి అందరికి తెలిసిందే. లాక్‌డౌన్ వల్ల ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఉపాధి లేక ఆర్థికంగా చితికిపోయారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజలను ఆదుకోవాలని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రారంభించారు. దీని కింద అందరికి ఉచితంగా రేషన్ సరుకులు అందించారు. అయితే ఈ పథకం గడువు నవంబర్‌తో ముగుస్తుంది. దీంతో దీనిని నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రేషన్ కార్డ్ హోల్డర్లకు నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు (గోధుమ-బియ్యం) అందించారు. రేషన్ కార్డ్‌లో ఉన్న సభ్యులకు అతని కోటా రేషన్‌తో పాటు, ఈ పథకం కింద ప్రతి నెలా 5 కిలోల అదనపు రేషన్ అందించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద లభించే ఈ రేషన్ పూర్తిగా ఉచితం. దీనివల్ల చాలామంది నిరుపేదలు లబ్ధి పొందారు. మధ్యలో ఈ పథకం ఆపివేస్తారని వార్తలు వచ్చాయి. ఇంతలో కరోనా సెకండ్ వేవ్‌ మొదలైంది. దీంతో మరోసారి లాక్‌డౌన్ విధించారు.

దీంతో కేంద్ర ప్రభుత్వం PMGKY 2.0 ప్రారంభమైంది. పథకం రెండవ దశ దీపావళి వరకు కొనసాగుతుంది అంటే నవంబర్ 4వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఈ పథకాన్ని మూసివేస్తారు. అయితే రేషన్‌ కార్డుపై ప్రతి నెల ఇచ్చే రేషన్‌ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఈ పథకం లాక్‌డౌన్‌లో పేదలకు బాసటగా నిలిచింది. ముఖ్యంగా వలసకూలీలు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం వల్ల ప్రభుత్వంపై చాలా భారం పడింది. కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.

Tags:    

Similar News