Ganesh Mandapal Stone Pelting : గణేష్ మండపాలపై రాళ్ల దాడి..ఆరుగురు అరెస్ట్

Ganesh Mandapal Stone Pelting: సూరత్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. సయ్యద్ పురా ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని దుండగులు గణేష్ మండపాలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-09-09 01:20 GMT

Ganesh Mandapal Stone Pelting : గణేష్ మండపాలపై రాళ్ల దాడి..ఆరుగురు అరెస్ట్

Ganesh Mandapal Stone Pelting: సూరత్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. సయ్యద్ పురా ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని దుండగులు గణేష్ మండపాలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చిన నిరసన తెలిపారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ప్రస్తుతం సూరత్ లో హైఅలర్ట్ విధించారు. పలు ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

గుజరాత్‌లోని సూరత్‌లో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గణేష్ మండపాలపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన సయ్యద్‌పురా ప్రాంతంలో చోటుచేసుకుంది. రాళ్లు రువ్విన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాళ్ల దాడికి నిరసనగా పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. శాంతి భద్రతల కోసం విజ్ఞప్తి చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే కాంతి బలార్‌ను కూడా ఆందోళనకారులు తోసివేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.

సూరత్ పోలీస్ కమీషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ మాట్లాడుతూ, "కొందరు గుర్తుతెలియని దుండగులు గణేష్ మండపాల‌పై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం. వెంటనే ఆ ప్రాంతంలో పోలీసులను మోహరించారు. ప్రజలు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. శాంతిభద్రతలను ద్రుష్టిలో ఉంచుకుని లాఠీఛార్జీ చేయాల్సి వచ్చిందని కమిషనర్ తెలిపారు. సయ్యద్ పురా ప్రాంతంలో ప్రస్తుతం 1000 మంది పోలీసులు మోహరించినట్లు కమిషనర్ వెల్లడించారు.


ఈ ఘటనపై గుజరాత్‌ హోంమంత్రి హర్ష్‌ సంఘ్వీ మాట్లాడుతూ.. సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలోని గణేష్‌ మండపాలపై ఈరోజు 6 మంది రాళ్లు రువ్వారు. ఈ 6 మందిని అరెస్టు చేశామని, అలాంటి ఘటనను ప్రోత్సహించిన మరో 27 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. సూరత్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ పోలీసులు మోహరించి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారని హోంమంత్రి తెలిపారు.

Tags:    

Similar News