Maoist Hidma: మావోయిస్టుల కోటలో తొలిసారిగా ఎగిరిన జాతీయ జెండా..
Maoist Hidma: ప్రభుత్వం నుండి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని ఎస్పీ హామీ
Maoist Hidma: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కేంద్ర బలగాలు తొలిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మావోయిస్టులకు సేఫ్ జోన్‌గా ఉన్న పువ్వర్తి అటవీ ప్రాంతాన్నికేంద్ర బలగాలు అధీనంలోకి తీసుకున్నాయి. మావోయిస్ట్ కమాండ్ హిడ్మా తల్లితో ఎస్పీ కిరణ్ చౌహాన్ ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. హిడ్మాను జనజీవన స్రవంతిలో కలిసేలా చూడాలని ఎస్పీ కోరారు. ప్రభుత్వం నుండి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. భద్రత బలగాలు పువ్వర్తి గ్రామంలోకి అడుగుపెట్టగానే గ్రామానికి చెందిన యువకులు, పురుషులు అడవిలోకి పరుగులు తీశారు. దీంతో అందరూ తిరిగి గ్రామానికి రావాలని భద్రతా దళాలు విజ్ఞప్తి చేశారు.