PM Modi Video Conference with CMs: మరోసారి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
PM Modi Video Conference with CMs: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్న అనుకున్న స్థాయిలో ఫలాలను సాధించలేకపోతున్నాయి.
PM Modi Video Conference with CMs: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్న అనుకున్న స్థాయిలో ఫలాలను సాధించలేకపోతున్నాయి. సడలింపుతో ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభం కావడంతో ప్రజలు బయటకు రావడం వల్ల పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో జులై 27న సోమవారం నాడు మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. చివరిసారిగా జూన్ 16,17 తేదీల్లో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుపై ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తుండటంతో వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.అయితే, కేవలం మహారాష్ట్ర, బెంగాల్, యూపీ సీఎంలతో మాత్రమే ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇందులో కాన్ఫరెన్స్ ఈ హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.
దేశంలో వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కావడం ఇది ఏడోసారి. ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న అన్‌లాక్ 2.0పై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించి, వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. అనంతరం కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు చేయనున్నారని తెలుస్తోంది.
ముఖ్యమంత్రులతో సమావేశంలో వారి నుంచి పలు అభిప్రాయాలను సేకరించి, కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. అయితే, దాదాపు నెలన్నర తర్వాత సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుండటంతో మరోసారి లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంటారా? అనే వ్యక్తమవుతోంది. వైరస్ ఉద్ధృతంగా ఉన్న తరుణంలో సీఎంలతో ప్రధాని భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది