కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే..

Narendra Modi: రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంలో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు.

Update: 2022-02-07 16:00 GMT

కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే..

Narendra Modi: రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంలో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్‌ హద్దు మీరి ప్రవర్తించిందని ఆరోపించారు. బ్రిటీష్‌ వారు ఇండియాను వదిలి వెళ్లినా వారు ఆచరించిన విభజించు పాలించు సూత్రాన్ని కాంగ్రెస్‌ వంటబట్టించుకుందని ఆరోపించారు. విభజించు పాలించు సూత్రం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే కాంగ్రెస్ ముక్కలు ముక్కలయిందన్నారు.

కరోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలో కాంగ్రెస్‌ రాజకీయాలకు పాల్పడిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తే.. ముంబై రైల్వే స్టేషన్‌లో కార్మికులకు కాంగ్రెస్‌ టికెట్లను ఇచ్చి మరీ పంపి వైరస్‌ను వ్యాపించేలా చేసిందని మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా బస్సులను పెట్టి.. పంపి.. కరోనా సోకేలా చేసిందని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ప్రసంగానికి అడ్డు తగిలారు.

అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోతున్నా కాంగ్రెస్‌లో అహంకారం పోలేదన్ని ప్రధాని మోదీ విమర్శించారు. నాగాలాండ్‌లో 24 ఏళ్ల క్రితం, ఒడిషాలో 27 ఏళ్ల క్రితం, గోవాలో 28 ఏళ్ల క్రితం, పశ్చిమ బెంగాల్‌లో 50 ఏళ్ల క్రితమే కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారన్నారు. ఇటీవల తెలంగాణను ఇచ్చినా అక్కడి ప్రజలు మాత్రం కాంగ్రెస్‌ను గెలిపించలేదన్నారు. నూరేళ్ల వరకు అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్‌ నిర్ణయించుకుందని తాను కూడా అందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు చెప్పారు.

Tags:    

Similar News