స్వయంగా చెత్త ఎత్తి.. స్వచ్ఛ స్ఫూర్తిని చాటిన ప్రధాని మోడీ
ITPO Tunnel: ఢిల్లీలో ప్రగతి మైదాన్ రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు అంతర్భాగంగా 920 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీపీవో టన్నెల్ నిర్మాణాన్ని ప్రధాని మోడీ ప్రారంబించారు.
ITPO Tunnel: ఢిల్లీలో ప్రగతి మైదాన్ రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు అంతర్భాగంగా 920 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీపీవో టన్నెల్ నిర్మాణాన్ని ప్రధాని మోడీ ప్రారంబించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్వచ్ఛ స్పూర్తిని చాటుకున్నారు. ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మోడీ అక్కడ కనిపించిన చిన్న చిన్న పెంకులను స్వయంగా వంగి తన చేతులతో తీశారు. అనంతరం ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్ ను ప్రధాని మోడీ పరిశీలించారు. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. సందర్శకులకు ఎలాంటచి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడికి చేరుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ రవాణా కారిడార్ ను నిర్మించింది.