G-20 Summit: పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిసిన ప్రధాని మోడీ

G-20 Summit: ఇటలీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని న‌రేంద్ర‌మోడీ వాటికన్‌సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు.

Update: 2021-10-30 11:08 GMT

G-20 Summit: పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిసిన ప్రధాని మోడీ

G-20 Summit: ఇటలీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని న‌రేంద్ర‌ మోడీ వాటికన్‌సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు. సుమారు గంటపాటు సమావేశమై పలు అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. పర్యావరణ మార్పులు, పేదరికం, కోవిడ్ మహమ్మారి వంటి పలు అంశాలపై మాట్లాడుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్‌తో దిగిన చిత్రాలను ప్రధాని మోడీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. పోప్‌ను భారత్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు.

వాటిక‌న్ సిటీకి వెళ్లిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో పాటు జాతీయ భ‌ద్ర‌తాస‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్ కూడా ఉన్నారు. వాటిక‌న్ సిటీ నుంచి రోమ్‌కు వ‌చ్చిన త‌ర్వాత జీ-20 స‌ద‌స్సులో ప్ర‌ధాని పాల్గొన‌నున్నారు. అనంత‌రం రేపు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో న‌గ‌రంలో ప్రారంభ‌మ‌య్యే కాప్‌-26 స‌ద‌స్సుకు హాజ‌రుకానున్నారు. కాప్-26 స‌ద‌స్సు వ‌చ్చే నెల 12 తారీఖున ముగియ‌నుంది.

Tags:    

Similar News