PM Modi: ఎన్డీఏకి దేశం.. దేశ ప్రజల భద్రత ముఖ్యం
PM Modi: ఎన్డీఏ ఏర్పాటులో అద్వానీది కీలక పాత్ర
PM Modi: ఎన్డీఏ ఏర్పాటులో అద్వానీది కీలక పాత్ర అని అన్నారు ప్రధాని మోడీ. 25 ఏళ్ల నుంచి ఎన్డీఏ దేశ సేవలో ఉందన్న మోడీ.. ఎన్డీఏ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. మిత్రపక్షాలు వివిధ రకాలుగా ఎన్డీఏకు మద్దతిచ్చాయని, ప్రజా వ్యతిరేక కూటములు ఎప్పుడు సఫలం కావని అన్నారు ప్రధాని. దేశంలో స్థిరమైన పాలన అందించడానికే ఎన్డీఏ కూటమన్నారు. NDA అంటే న్యూ ఇండియా డెవలప్‌మెంట్ యాస్పిరేషన్ అని వివరించారు. ప్రజా వ్యతిరేక కూటములు ఒక్కటవుతున్నాయని, తామెప్పుడూ విదేశీ శక్తుల సాయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఎన్డీఏ కూటమిలోకి కొత్త మిత్రులకు స్వాగతం పలికిన మోడీ.. ఎన్డీఏకి దేశం.. దేశ ప్రజల భద్రత ముఖ్యమన్నారు. ఢిల్లీలోని హోటల్ అశోక్ లో ఎన్డీయే మిత్రపక్షాల భేటీ కొనసాగుతోంది. ఈ భేటీకి ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా.. 38 పార్టీల నేతలు హాజరయ్యారు. జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది.