జెలెన్‌స్కీకి ప్రధాని మోడీ కృతజ్ఞతలు
Russia-Ukraine Conflict: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
Russia-Ukraine Conflict: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాధినేతలు 35 నిమిషాలకు పైగా ఫోన్‌లో మాట్లాడుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు నిర్వహించడాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఉక్రెయిన్‌లోని భారతీయులను తరలింపునకు సహకరించినందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఇంకా భారతీయులు ఉన్నారని వారందరినీ తరలించేందుకు మరింత సహకారం అందించాలని ప్రధాని కోరారు.
ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టిన తరువాత రెండు సార్లు పుతిన్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. సుమీ నగరంలోని చిక్కుకుపోయిన వందలాది మంది భారతీయుల తరలింపునకు మరింత సహకారం అందించాలని కోరే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సుమీతో పాటు ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది.