PM Surya Ghar: కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌.. ప్రధాని కీలక ప్రకటన

PM Surya Ghar: పీఎం సూర్య ఘర్-ముఫ్త్​బిజిలీ పేరుతో పథకం

Update: 2024-02-14 03:38 GMT

PM Surya Ghar: కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌.. ప్రధాని కీలక ప్రకటన

PM Surya Ghar: మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన రూఫ్‌టాప్ సోలార్ పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. పీఎం సూర్య ఘర్: ముఫ్త్​ బిజిలీ పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. ఇందుకోసం 75 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ పథకంతో కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంట్‌ను అందిస్తామని హామీ ఇచ్చింది కేంద్రం.

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉచిత కరెంట్​పై దృష్టి సారిస్తున్న ఎన్డీయే సర్కార్... ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టనుంది. స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ పరిధిలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించే ఏర్పాట్లు చేస్తోంది. సూర్య ఘర్ వల్ల జనానికి ఆదాయం రావడమేగాక కరెంటు బిల్లు భారం తప్పనుంది.

Tags:    

Similar News