పంబన్ బ్రిడ్జి ప్రారంభించిన ప్రధాని మోదీ... ఈ రూట్లో ఇండియా నుండి శ్రీలంక ఎలా వెళ్తారంటే..

Update: 2025-04-06 09:36 GMT

పంబన్ బ్రిడ్జి ప్రారంభించిన ప్రధాని మోదీ... ఈ రూట్లో ఇండియా నుండి శ్రీలంక ఎలా వెళ్తారంటే..

How Pamban Bridge connects India and Sri Lanka route: ప్రధాని మోదీ పంబన్ బ్రిడ్జి ప్రారంభించారు. శ్రీలంక పర్యటన ముగించుకుని రామేశ్వరం చేరుకున్న ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. అనంతరం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర నేతలతో కలిసి పంబన్ బ్రిడ్జిని ప్రారంభించి ఆ వంతెనపై నుండి వెళ్లే తొలి రైలుకు పచ్చ జండా ఊపారు. ఇప్పటివరకు 110 ఏళ్లుగా ఉన్న పాత బ్రిడ్జికి బదులుగా రూ. 700 కోట్ల నిధులతో ఈ కొత్త బ్రిడ్జిని నిర్మించారు.

రామ సేతు మార్గంలో ఇండియా, శ్రీలంకను కలుపుతూ సముద్రంపై ఒక వంతెన నిర్మించేందుకు 1876 లోనే మొదటిసారిగా ఒక ప్రణాళిక తెరపైకి వచ్చింది. అయితే, అది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో అప్పట్లో ఆ ప్రణాళిక ప్రారంభం అవకుండానే ఆగిపోయింది.

ఆ తరువాత 1906 లో మరో కొత్త ప్రణాళిక రచించారు. మధురై నుండి రామేశ్వరం మీదుగా ధనుష్ కోడి వరకు రైల్వే లైన్ నిర్మించాలని ప్లాన్ చేశారు. ధనుష్ కోడి వరకు రైలు ద్వారా చేరుకున్న తరువాత అక్కడి నుండి స్ట్రీమర్ సర్వీస్ ద్వారా శ్రీలంక వెళ్లేలా మార్గం ప్లాన్ చేశారు. అలా 110 ఏళ్ల క్రితం.. అంటే 1914 ఫిబ్రవరి 24న పంబన్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఇండియాలో సముద్రంపై నిర్మించిన తొలి వంతెనగా ఇది రికార్డుకెక్కింది.

ధనుష్‌కోడి ఇండియా పరిధిలోకి వస్తుంది. భారత జలాల్లో ఉండే దివి ప్రాంతం ఇది. ఇక్కడి నుండి శ్రీలంకలోని తలైమన్నార్ 27 కిమీ (14.4 నాటికల్ మైల్స్) ఉంటుంది. తలైమన్నార్ శ్రీలంకలో వేసే తొలి అడుగు అవుతుంది. అక్కడి నుండి భూ భాగం లేదా సముద్ర మార్గంలోనే మన్నార్ వరకు వెళ్లొచ్చు. తలైమన్నార్, మన్నార్ సముద్ర జలాల్లో ఉండే ఒక చిన్న స్ట్రిప్ లాంటి ప్రాంతాలు మాత్రమే. మన్నార్ దాటిన తరువాతే అసలు శ్రీలంక మొదలవుతుంది.

ప్రస్తుతం కొన్ని క్రూయిజ్, స్ట్రీమర్ సర్వీసులు ధనుష్‌కోడి నుండి తలైమన్నార్ వెళ్లకుండా శ్రీలంక ఉత్తర భాగంలోని జాఫ్నా వరకు వెళ్లేందుకు అందుబాటులో ఉన్నాయి. అయితే, అతి దగ్గరి మార్గంలో శ్రీలంక వెళ్లాలనుకునే వారు ధనుష్‌కోడి నుండి తలైమన్నార్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ధనుష్‌కోడి నుండి జాఫ్నాకు మధ్య సముద్ర మార్గం 50 కిమీ (27 నాటికల్ మైల్స్) ఉంటుంది. కానీ ధనుష్‌కోడి - తలైమన్నార్ మధ్య దూరం 27 కిమీ మాత్రమే. 

తమిళనాడు‌లోని నాగపట్టణం నుండి నేరుగా జాఫ్నాకు కూడా సముద్రమార్గం ఉంది. రైలు, సముద్ర మార్గాలు కాకుండా ఇండియా, శ్రీలంకను కనెక్ట్ చేస్తూ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి.

సముద్ర నీటి మట్టంపై 12.5 మీటర్ల ఎత్తులో పంబన్ బ్రిడ్జి నిర్మించారు. అప్పట్లో 145 పిల్లర్లతో ఈ వంతెనను నిర్మించారు. పంబన్ రైల్వే బ్రిడ్జి వల్ల ఆ మార్గంలో రాకపోకలు సాగించే భారీ ఓడలకు అడ్డంకి లేకుండా ఓడల కోసం మధ్యలో బ్రిడ్జిని లిఫ్ట్ చేసేలా బ్రిడ్జిని నిర్మించారు. 

Tags:    

Similar News