Tahawwur Rana: తహవ్వుర్ రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ.. రాణా లేటెస్ట్ ఫోటో ఇదే

Tahawwur Rana: ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్ హుస్సేన్ రాణాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. గురువారం అర్థరాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జీ ఎదుట హాజరుపరిచారు. సీనియర్ న్యాయవాది దయాన్ క్రిష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేంద్ర మాన్ ఎన్ఐఏ తరపున కోర్టులో వాదనలు వినిపించారు.
రాణా తరపున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది పీయూష్ సచ్ దేవా వాదించారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చందర్ జిత్ సింగ్ వాదనలు విన్నారు. రాణాను 20 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని ఎన్ఐఏ కోరింది. 18 రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ కార్యాలయం, పాటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
అయితే తహవ్వుర్ రాణాకు సంబంధించిన ఫస్ట్ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఫోటో కూడా చాలా ఆశ్చర్యకంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలో రాణా చాలా వ్రుద్ధుడిగా కనిపిస్తున్నాడు. తెల్లగడ్డంతో ఉన్నాడ. జుట్టు కూడా తెల్లగా మారింది. కళ్లకు అద్దాలు పెట్టుకుని గోధుమ రంగు షర్ట్ వేసుకున్నాడు.