IAS: వ్యవసాయం చేయాలనుకున్నాడు.. సీన్ కట్ చేస్తే UPSC క్రాకర్.. కోట్ల ఆస్తులకు ఓనర్.. ఎవరితను?
ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక ఆస్తులున్న అరవింద్ మల్లప్ప బంగారి 2011 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుత అగ్రా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన వద్ద 11 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నట్లు సమాచారం. ఆయన ఆస్తులలో చాలావరకు వారసత్వ ప్రాపర్టీలే ఉండటం విశేషం.

ఉత్తరప్రదేశ్‌లో అగ్ర జీతం.. ప్రతిష్ఠ కలిగిన ఐఏఎస్ అధికారులలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి గురించి తెలుసుకుందాం. యూపీ రాష్ట్రంలో ప్రస్తుతం అగ్రా కలెక్టర్‌గా (డిస్ట్రిక్ట్ మజిస్ట్రేట్) పనిచేస్తున్న వ్యక్తి అరవింద్ మల్లప్ప బంగారి. ఈయనకే రాష్ట్రంలోని అత్యధిక ఆస్తులున్న కలెక్టర్ అనే పేరుంది. ఆయన 2011 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ బంగారి ఇప్పటివరకు మొత్తం 15 ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటించారు. 5 ఏళ్ల క్రితం ఆయన వద్ద 12 ఆస్తులే ఉండగా.. ఇప్పుడు ఈ సంఖ్య పెరిగింది.
అరవింద్ మల్లప్ప బంగారి అసలు ఊరు కర్ణాటకలోని గడక్ జిల్లా. 1981 మార్చి 30న జన్మించిన ఆయన ధారవాడ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం వ్యవసాయంలో MSc చేసి, వ్యవసాయ శాస్త్రవేత్త కావాలని కోరుకున్నారట. ఓ ల్యాబ్‌లో ఒక సంవత్సరం పని చేసిన తరువాత, తన దృష్టిని సివిల్ సర్వీసెస్‌పై కేంద్రీకరించారు. 2011లో UPSCలో 83వ ర్యాంకుతో ఐఏఎస్ అయ్యారు. 2012లో శిక్షణ పూర్తిచేసి తొలి పోస్టింగ్‌గా ఝాన్సీలో నియమితులయ్యారు.
ఇప్పుడు ఆయన వద్ద ఉన్న ఆస్తులు ఏమిటంటే.. కర్ణాటకలో ఐదు వ్యవసాయ భూములు, మూడు ఇళ్లు, ఒక ఫ్లాట్, ఒక కమర్షియల్ ప్రాపర్టీ, ఇంకా ఆరు ప్లాట్లు ఉన్నాయి. అందులో చాలా భాగం వారసత్వ ఆస్తులే అని సమాచారం. ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న ఆస్తుల మొత్తం విలువ 11 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉంది. ఆయన తండ్రి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కాగా, కుటుంబంలోనే మంచి స్థిర ఆర్థిక స్థితి ఉన్నట్లు తెలుస్తోంది. 2024 సెప్టెంబర్ నుంచి అగ్రా కలెక్టర్‌గా పని చేస్తున్న బంగారి.. 2023 జనవరి నుంచి 2024 సెప్టెంబర్ వరకు ముజఫర్‌నగర్ కలెక్టర్‌గా పని చేశారు. ప్రజాసేవలో ఆయన్ను ఉత్తమ అధికారిగా గుర్తించడంతో పాటు ఆయన ఆస్తుల పరంగా కూడా అందరికన్నా ముందున్న ఐఏఎస్ అధికారి అనే గుర్తింపు పొందారు.