
రూ. 1000 తో పామును కొని తెలివిగా భర్తను మర్డర్ చేసింది... కానీ ఇలా దొరికిపోయింది
Woman killed husband by staging snake bites drama
Woman killed husband by staging snake bites drama: పెళ్లయ్యాకా కొత్త రుచులు వెతుక్కుంటూ వెళ్తున్న జంటలు వారికి అడ్డులేకుండా ఉండేందుకు జీవిత భాగస్వామిని మట్టుపెట్టేందుకు సైతం వెనుకాడటం లేదు. భార్యను చంపిన భర్త, భర్తను చంపిన భార్య అని అనేక ఘటనలు మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే, వారు ఎవ్వరికీ అనుమానం రాకుండా మర్డర్ చేస్తున్న తీరే పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన యువతి, ఆ శవాన్ని ముక్కలు ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములోనే సిమెంట్‌తో సీల్ చేసిన న్యూస్ పెను సంచలనం సృష్టించింది. ఆ మర్డర్ మిస్టరీ ఛేదించిన నెల రోజుల్లోపే అదే మీరట్ లో మరో మర్డర్ మిస్టరీ పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.
మీరట్‌కు చెందిన అమిత్ కశ్యప్, రవిత భార్యభర్తలు. ఆదివారం కశ్యప్ ఇంట్లోనే బెడ్‌పై శవమై కనిపించాడు. అతడి పక్కలో పాము కనిపించింది. కశ్యప్ ఒంటిపై 10 చోట్ల పాము కాట్లు కనిపించాయి. ఆ సీన్ చూసిన వాళ్లంతా కశ్యప్ పాము కాటుకు గురై చనిపోయాడని భావించారు. పోలీసులు కూడా అదే నిజమని అనుకున్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్టులో డాక్టర్స్ చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు.
కశ్యప్ మృతికి కారణం పాము కాటు కాదని, అతడికి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఆ తరువాతే కశ్యప్ శవాన్ని పాము కాటేసిందని డాక్టర్స్ గుర్తించారు.
ఇదే విషయమై అనుమానం వచ్చిన పోలీసులు ముందుగా కశ్యప్ భార్య రవితను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రవిత చెప్పిన మర్డర్ మిస్టరీ విని పోలీసులే షాక్ అయ్యారు.
రవితకు తన భర్త కశ్యప్ స్నేహితుడైన అమర్ దీప్‌తో స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ విషయం తెలుసుకున్న కశ్యప్ భార్య రవిత తీరు మార్చుకోవాల్సిందిగా మందలించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఇలా భర్తతో రోజూ గొడవలు పడటం కంటే ఒకేసారి అతడిని వదిలించుకోవడం ఉత్తమం అని భావించిన రవిత, తన ప్రియుడు అమర్ దీప్‌తో కలిసి మర్డర్ స్కెచ్ వేసింది.
రూ. 1000 పెట్టి పాము కొనుగోలు
రవిత, అమర్ దీప్ వేసుకున్న స్కెచ్ ప్రకారం రూ. 1000 లతో ఒక పామును కొనుగోలు చేశారు. ఆదివారం రాత్రి కశ్యప్‌ను ఊపిరి ఆడకుండా చేసి చింపేసిన రవిత... ఏమీ ఎరుగనట్లుగా ఆ పామును తీసుకొచ్చి అతడి పక్కలో పడేసింది. పైగా నేరం జరిగినట్లుగా అనుమానం రాకుండా కశ్యప్ మంచం వద్ద అన్నం తిన్న ప్లేట్, పాల గ్లాస్ పెట్టింది. తనకు అన్నం వడ్డించి వెళ్లి పడుకున్నట్లుగా సీన్ క్రియేట్ చేసింది.
మొదట పోలీసులు అడిగితే అలాగే జవాబిచ్చి తప్పించుకుంది. రవిత స్కెచ్ ప్రకారమే చనిపోయిన కశ్యప్‌ను పాము కాటేయడంతో పాము కాటు వల్లే అతడు చనిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో రవిత మర్డర్ స్కెచ్ బయటపడింది. పోలీసుల విచారణలో రవిత, అమర్ దీప్ తమ నేరాన్ని అంగీకరించారు.