సంసారంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ పెట్టిన చిచ్చు... లవర్‌తో కలిసి భర్తను చంపిన భార్య

Youtuber kills her husband: రవీనా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం భర్త ప్రవీణ్‌కు ఇష్టం లేదు.

Update: 2025-04-16 10:37 GMT
సంసారంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ పెట్టిన చిచ్చు... లవర్‌తో కలిసి భర్తను చంపిన భార్య
  • whatsapp icon

Lady youtuber kills her husband: యూట్యూబర్స్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్స్ ఆయా సామాజిక మాధ్యమాలను తమ ప్యాషన్ కోసమో లేక బతుకుదెరువు కోసమో ఉపయోగించుకున్నంత వరకు పర్వాలేదు. కానీ అంతకుమించి శృతి మించితేనే అసలు ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్యాషన్, క్రేజ్ అనేవి జీవితంలో ఒక భాగమే... అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ ప్యాషన్ అడ్డుపెట్టుకుని కట్టుకున్న వారిని పక్కనపెట్టి, పరాయి వ్యక్తిని జీవితంలోకి రానిస్తే అసలు జీవితమే లేకుండా పోతుంది. ఈ విషయం తెలియక చాలామంది తమ జీవితాలు ఆగం చేసుకుంటున్నారు.

హర్యానాలో చోటుచేసుకున్న ఒక ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడిప్పుడే యూట్యూబర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రాణిస్తున్న రవీనా అనే లేడీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏడాదిన్నర క్రితం పరిచయమైన సురేష్ అనే వ్యక్తితో కలిసి భర్తను చంపేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హర్యానాలోని భివానిలోని ప్రేమ్ నగర్‌కు చెందిన ప్రవీణ్‌తో రవీనాకు 2017 లో పెళ్లయింది. ఆ ఇద్దరికీ ఆరేళ్ల పాప కూడా ఉంది. సోషల్ మీడియాకు ఉన్న క్రేజ్ చూసి ఇటీవలే రవీనా కూడా వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ఆమె వీడియోలకు క్రమక్రమంగా ఫాలోవర్స్ రావడం మొదలైంది.

రవీనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 34000 మంది, యూట్యూబ్‌లో 5000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఏడాదిన్నర క్రితం రవీనాకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సురేష్ పరిచయమయ్యాడు. ఆ తరువాత సురేష్‌తో కలిసి వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.

రవీనా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం భర్త ప్రవీణ్‌తో పాటు ఆ ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. దానికితోడు షూటింగ్స్ పేరుతో ప్రయాణాలు చేయడం ఎక్కువైంది. దీంతో వీడియోలు చేయడం మానేయాలని ఎంతచెప్పినా రవీనా మాత్రం మానుకోలేదు. రవీనా వైఖరి చూసి ప్రవీణ్ కుమార్‌కు అనుమానం వచ్చింది. సురేష్‌తో ఆమె ఎఫైర్‌లో ఉన్నట్లు ప్రవీణ్ అనుమానించాడు.

ప్రవీణ్ అనుకున్నట్లుగానే మార్చి 25న తను ఇంటికి వచ్చేటప్పటికి రవీనా, సురేష్ రొమాన్స్ చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. భర్త ప్రవీణ్ కుమార్ తమను అలా చూడటంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రవీణ్ వారితో గొడవపడ్డాడు. అదే అదునుగా సురేష్ సాయంతో చున్నీతో ప్రవీణ్‌కు ఊపిరి ఆడకుండా చేసి భర్తను చంపేసింది.

ప్రవీణ్ గురించి ఇంట్లో వారు, ఇరుగుపొరుగు అడిగినప్పటికీ తనకేం తెలియదని చెప్పి బుకాయించింది. ప్రవీణ్ శవం మాయం చేసేందుకు రవీనా, సురేష్ ఇద్దరూ ఆ రోజు అర్ధరాత్రి అయ్యేవరకు వెయిట్ చేశారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రవీణ్ రావడంతో అతడి బైకుపై ప్రవీణ్ శవాన్ని మధ్యలో కూర్చొబెట్టుకుని తీసుకువెళ్లారు. ఇంటికి 6 కిమీ దూరంలో ఉన్న మురికి కాల్వలో ప్రవీణ్ శవాన్ని పడేసి వచ్చారు.


3 రోజుల తరువాత ప్రవీణ్ శవం కుళ్లిన స్థితిలో స్థానికుల కంటపడింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు హత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించినప్పుడు అర్ధరాత్రి వేళ బైకుపై ముగ్గురు వ్యక్తులు వెళ్లడం, వచ్చేటప్పుడు ఇద్దరే రావడం కనిపించింది. ఆ ఇద్దరూ రవీనా, సురేష్ అని నిర్ధారించుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు నిజం కక్కారు.

తమను ప్రవీణ్ చూడకూడని పరిస్థితుల్లో చూసి గొడవపడ్డాడని, అందుకే ఇద్దరం కలిసి చంపేశామని తాపీగా సమాధానం ఇచ్చారు. మొత్తానికి భర్తను ఇంట్లోనే చంపడమే కాకుండా తమకేమీ సంబంధం లేదన్నట్లుగా శవాన్ని కూడా మాయం చేసేందుకు ప్రయత్నించారు. మర్డర్ కేసులో రవీనా, సురేష్‌లను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు.

Tags:    

Similar News