EVM: అంతా చీటింగ్.. ఇండియాలో EVMలపై తులసీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు..!
EVM: వీటిలో Wi-Fi, బ్లూటూత్ లేదా ఇన్‌ఫ్రారెడ్ వంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఫీచర్లు ఏవీ ఉండవు.

EVM: అంతా చీటింగ్.. ఇండియాలో EVMలపై తులసీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు..!
EVM: భారత ఎన్నికల్లో వాడుతున్న ఈవీఎంలపై అనుమానాలు అవసరం లేదని ఎన్నికల సంఘం వర్గాలు స్పష్టం చేశాయి. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ ఈవీఎంలకు హ్యాకింగ్ ప్రమాదం ఉందని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ భారత ఈవీఎంలు ట్యాంపర్ ఫ్రూఫ్‌గా ఉంటాయని, సాధారణ కాలిక్యులేటర్‌లా పనిచేస్తాయని తెలిపారు.
ప్రస్తుతం చాలా దేశాల్లో ఉపయోగిస్తున్న ఈ-వోటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. వాటిలో ఇంటర్నెట్, ప్రైవేట్ నెట్‌వర్క్‌లు, క్లౌడ్ ఆధారిత టెక్నాలజీలు ఉపయోగించారు. అయితే భారత్‌లో వాడుతున్న ఈవీఎంలు ఎలాంటి నెట్‌వర్క్‌కు కనెక్ట్ కాని విధంగా రూపొందించారు. వీటిలో Wi-Fi, బ్లూటూత్ లేదా ఇన్‌ఫ్రారెడ్ వంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఫీచర్లు ఏవీ ఉండవు.
ఈవీఎంలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణలు జరిగి, సరైనదేనని తీర్పులు వచ్చినట్లు తెలిపారు. పోలింగ్‌కు ముందు అన్ని పార్టీల సమక్షంలో మాక్ పోల్స్ నిర్వహించడం, కౌంటింగ్ సమయంలో అభ్యర్థుల ఎదుటే VVPAT స్లిప్పుల వాలిడేషన్ జరగడం భారత ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను నిరూపిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 5 కోట్ల కంటే ఎక్కువ VVPAT స్లిప్పులు వేరిఫై చేసినట్లు వివరించారు.
ఇక తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యల పరంగా చూస్తే, ఆమె ఓ నిర్దిష్ట దేశం లేదా టెక్నాలజీ గురించిగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్స్‌లో గల లోపాలపై సాధారణంగా వ్యాఖ్యానించారు. ఆమె పేపర్ బ్యాలెట్ పద్ధతిని పునరుద్ధరించాలని, ఎన్నికలపై ప్రజల్లో నమ్మకం నెలకొల్పాలన్న ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.