ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చాడు, ప్రేమలో పడేశాడు.. ఏం మాయ చేశావు గురూ!
Viral News: 'ప్రేమ పలాన టైమ్‌కి పలాన వ్యక్తితో పుడుతుంది ఎవరికీ తెలియదు' ఇది ఓ సినిమాలో డైలాగ్.

ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చాడు, ప్రేమలో పడేశాడు.. ఏం మాయ చేశావు గురూ!
Viral News: 'ప్రేమ పలాన టైమ్‌కి పలాన వ్యక్తితో పుడుతుంది ఎవరికీ తెలియదు' ఇది ఓ సినిమాలో డైలాగ్. నిజమే అన్ని లెక్కలు వేసుకొని చేసేది ప్రేమ కానే కాదు. ఆస్తి, అంతస్తులు, అందం, కులం, మతం ప్రాంతం ఇలా ఏదీ ప్రేమకు అడ్డంకి కాదు. అందుకే ప్రేమ గొప్పతనాన్ని గురించి కవులు సైతం ఎంతో గొప్పగా వర్ణించారు. తాజాగా బిహార్‌లో జరిగిన ఓ ప్రేమ వివాహం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని ఓ గ్రామానికి చెందిన యువతి ఇంట్లో ఫ్యాన్ పాడవ్వడంతో రిపేర్ కోసం ఒక ఎలక్ట్రిషియన్‌ను పిలిచింది. మొదటిసారి వచ్చినప్పుడు ఆ ఎలక్ట్రిషియన్ తన పని చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే యువతి మాత్రం అప్పటినుంచి అతనిపై మనసు పారేసుకుంది. తొలి చూపులోనే అతనిపై ప్రేమను పెంచుకుంది.
అదే సమయంలో అతని ఫోన్ నెంబర్‌ను తీసుకుంది. ఇకపై ఇంట్లో ఏ వస్తువు పాడైనా వెంటనే అతనికి ఫోన్ కాల్ చేసేది. ఒక్కసారి ఫ్యాన్, మరోసారి లైట్, మరొకసారి డిష్ టీవీ.. ఇలా కారణాలెన్నో చెబుతూ తరచూ ఇంటికి పిలవడం ప్రారంభించింది. ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. తాజాగా వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
వివాహం అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడుతూ వీరిద్ద పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. యువకుడు మాట్లాడుతూ.. 'తొలిసారి రిపేర్‌కు వెళ్లినప్పుడు, ఆమె నన్ను గమనించిందని నాకు అప్పుడే అర్థం కాలేదు. కానీ ఆ తర్వాతి రోజుల్లో ఆమె తరచూ కాల్ చేయడం మొదలుపెట్టింది. ఒక రోజు నేరుగా నాకు వ్యక్తిగతంగా మెసేజ్ చేసింది' అని చెప్పుకొచ్చాడు.
ఇక ఆ యువతి సైతం తన మనసులో మాటను బయటపెట్టింది “ఆయన నా మనసు దోచేశాడు. ఏదో ప్రత్యేకత కనిపించింది. మొదట్లో చెప్పలేకపోయాను కానీ, అలా మాట్లాడుతుంటే ప్రేమ పుట్టింది' అని చెప్పుకొచ్చింది. ఇద్దరూ కలిసి చివరికి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వారి ప్రేమకథ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీరిద్దరు మాట్లాడిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.