PM Kisan: పీఎం కిసాన్‌ 20వ విడుత నిధుల కోసం ఎదురు చూస్తున్నారా? ఏప్రిల్‌ 30లోపు ఈ పనిచేయకపోతే డబ్బులు పడవు

PM Kisan 20th Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన 20 విడత విడుదల నిధుల విడుదల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

Update: 2025-04-12 13:00 GMT
PM Kisan

PM Kisan: పీఎం కిసాన్‌ 20వ విడుత నిధుల కోసం ఎదురు చూస్తున్నారా? ఏప్రిల్‌ 30లోపు ఈ పనిచేయకపోతే డబ్బులు పడవు

  • whatsapp icon

PM Kisan 20th Installment: ఏప్రిల్ 30లోపు ఈ పని చేయకపోతే మీకు ప్రధాన మంత్రి కిసాన్‌ నిధులు పడవు. అందుకే ఈ నేపథ్యంలో ముందుగానే ఆ పని పూర్తి చేసుకోవాలి. ఇప్పటికీ 19వ విడత నిధులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 20వ విడత నిధులను మంజూరుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీలోపు రైతులు ఈ పని ముందుగానే చేయాలి లేకపోతే వాళ్లకు డబ్బులు క్రెడిట్ కావు.

పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన (PMKSY) కేంద్ర ప్రభుత్వం పరిచయం చేసిన ఈ పథకం ప్రతి ఏడాది రూ.6000 రైతుల ఖాతాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్ (DBT) చేస్తుంది. ప్రధానంగా ఈ పథకం ద్వారా వ్యవసాయ పెట్టుబడులకు సహాయంగా నిధులను అందిస్తుంది. ఇప్పటివరకు 19 విడుత నిధులు మంజూరు చేసింది. ప్రతి ఏడాది రూ.6000 అంటే రూ.2000 చొప్పున ఈ నిధులను మంజూరు చేస్తుంది.

ఇప్పటివరకు 19 విడతలు నిధులను మంజూరు చేసింది కేంద్రం. కొన్ని కోట్ల మంది దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 2019లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు ఎంతో గాను ప్రయోజనకరంగా ఉంది. అయితే ఈ పథకం ద్వారా మీరు కూడా లబ్ధి పొందాలంటే ఏప్రిల్ 30 లోపు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి.

అధికారిక వెబ్‌సైట్లో కూడా ఈ పని పూర్తి చేయవచ్చు. దీనికి PMkisan.in అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి 'ఫార్మర్స్ కార్నర్' లో క్లిక్ చేయండి. అక్కడ లబ్ధిదారుల జాబితా పై ఎంపిక చేసి మీ జిల్లా, స్టేట్, గ్రామపంచాయతీని ఎంపిక చేసుకోవాలి.

పీఎం కిసాన్‌ ఇకేవైసీ..

పీఎం కిసాన్ ఈ అధికారిక వెబ్‌సైట్లో 'ఫార్మర్స్ కార్నర్' లో 'ఇకేవైసీ' అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్ నమోదు చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇకేవైసీ పూర్తవుతుంది.

Tags:    

Similar News