
PM MODI: వారణాసి అత్యాచార ఘటనపై మోదీ ఆరా ..దిగ్భ్రాంతికి లోనైన ప్రధాని
PM MODI: యూపీలోని వారణాసిలో చోటుచేసుకున్న దారుణ సామూహిక అత్యాచార ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటనపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 6రోజుల్లో 23 మంది దుర్మార్గులు 19ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఈ అవమానీయ ఘటన ఈ మధ్యే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది ప్రధాని మోదీ ద్రుష్టికి వెళ్లింది. దీంతో ప్రధాని మోదీ ఈ ఘటనపై ఆరా తీశారు. పోలీసులు, కలెక్టర్ తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.