Dayan Krishnan: ముంబై ఉగ్రదాడి సుత్రధారికి వ్యతిరేకంగా వాదిస్తున్న భారతీయ లాయర్ దయన్ కృష్ణన్ ఎవరు?
Dayan Krishnan: తహవ్వూర్ రానా కేసులో భారత్ తరపున న్యాయపోరాటానికి నాయకత్వం వహించబోయే డయాన్ కృష్ణన్ గతంలో దేశంలోనే చాలా పెద్ద కేసులను నడిపిన అనుభవం ఉన్న న్యాయవాది. హెడ్‌లీ విచారణలో భాగస్వామిగా, రాణా ఎగ్జిట్రడిషన్‌ను సిద్ధం చేసిన కీలక న్యాయవాది కూడా ఆయనే. ఇప్పుడు ముంబై ఉగ్రదాడికి న్యాయంగా తీర్పు తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకం కానుంది.

Dayan Krishnan: ముంబై ఉగ్రదాడి సుత్రధారికి వ్యతిరేకంగా వాదిస్తున్న భారతీయ లాయర్ దయన్ కృష్ణన్ ఎవరు?
Dayan Krishnan: 2008 ముంబై ఉగ్రదాడుల్లో కీలక నిందితుడైన తహవ్వూర్ రానాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన తర్వాత, ఈ కేసులో న్యాయ పోరాటానికి భారత్ తరపున నడిపించబోయే న్యాయవాది ఎవరు అనే దానిపై దృష్టి మళ్లింది. ఈ కీలకమైన న్యాయపోరులో భారత్ తరపున న్యాయపరంగా ముందుండబోయే వ్యక్తి, సుప్రీంకోర్టు న్యాయనిపుణుడు డయాన్ కృష్ణన్.
డయాన్ కృష్ణన్ దేశంలో అత్యంత అనుభవజ్ఞుడైన క్రిమినల్ లాయర్లలో ఒకరు. 1993లో నేషనల్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన ఆయన, 1999లో స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2001లో పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి కేసుతో పాటు, 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో కూడా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేగాక, జస్టిస్ జెఎస్ వర్మ కమిషన్‌లో భాగస్వామిగా ఉన్నారు.
తహవ్వూర్ రానా విచారణ విషయంలో ఆయనకు ఉన్న అనుభవం ప్రత్యేకం. 2010లో డేవిడ్ హెడ్‌లీని చికాగోలో ప్రశ్నించిన ఎన్ఐఏ బృందంలో ఆయన ఒకరుగా ఉన్నారు. 2014లో రానా మరియు హెడ్‌లీ ఎగ్జిట్రడిషన్ కేసుల్లో స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి రానా ఎగ్జిట్రడిషన్ కేసులో కృష్ణన్ పోరాటం సాగింది.
తాజాగా అమెరికాలోని కోర్టుల్లో తహవ్వూర్ రానా చేసిన డబుల్ జెపర్డీ (ఒకే నేరంపై రెండుసార్లు శిక్ష విధించకూడదు) వాదనను డయాన్ కృష్ణన్ నిషేధించగలిగారు. 2023 మేలో అమెరికా మేజిస్ట్రేట్ జడ్జి ఈ వాదనను తిరస్కరించగా, అదే తరహాలో జిల్లా కోర్ట్, అప్పీల్ కోర్ట్‌లూ కృష్ణన్ వాదనకు మద్దతిచ్చాయి. చివరికి US సుప్రీం కోర్ట్ కూడా 2025 జనవరిలో రానాకు ఉపశమనాన్ని నిరాకరించింది. చివరి రివ్యూ పిటిషన్ 2025 ఏప్రిల్ 4న తిరస్కరించబడడంతో, రానా భారత్‌కు అప్పగింపు మార్గం సుగమమయ్యింది. ఇప్పుడు డయాన్ కృష్ణన్‌తో పాటు నరేందర్ మాన్, సంజీవి శేషాద్రి, శ్రీధర్ కాళే వంటి న్యాయవాదులు ఈ కేసులో న్యాయపరమైన బలమైన అగ్రరేఖగా వ్యవహరించనున్నారు.