తనకంటే చిన్నవాడితో ఇద్దరు పిల్లలున్న మహిళ ప్రేమాయణం.. భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్..!
Viral News: సమాజంలో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. మానవ సంబంధాలన్నీ ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.

తనకంటే చిన్నవాడితో ఇద్దరు పిల్లలున్న మహిళ ప్రేమాయణం.. భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్..!
Viral News: సమాజంలో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. మానవ సంబంధాలన్నీ ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. కొందరు వ్యవహారశైలి చూస్తుంటే అసలు సమాజం ఎటు వెళ్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెళ్లై, పిల్లలున్న మహిళలు ప్రియుడిని పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు ఇటీవల సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా ఇలాంటి ఓ ఆశ్చర్యకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా నుంచి ఓ అసాధారణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తే స్వయంగా భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. పప్పు అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్యోన్యంగా సాగుతోన్న వీరి జీవితంలోకి మరో వ్యక్తి వచ్చాడు. పప్పు భార్య మరో యువకుడితో ప్రేమలో పడింది. అతను ఆమె కంటే చిన్న వయసు కావడం గమనార్హం.
ఈ వ్యవహారం చాలా కాలంగా రహస్యంగానే కొనసాగింది. చివరకు భర్తకు విషయం తెలిసింది. మొదట్లో భార్యను నచ్చచెప్పడానికి చాలా చేసినా ఫలితం లేకుండా పోయింది. అటు సమాజం నుంచి ఎదురయ్యే విమర్శలు, ఇటు కుటుంబంలో కలుగుతున్న కలహాలు చూసి పప్పు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యకు, ఆమె ప్రేమికుడికి స్వయంగా పెళ్లి జరిపించాడు.
ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఇది ప్రేమే కాదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ సంఘటన సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.