బీహార్‌లో 3 కీలకమైన పెట్రోలియం ప్రాజెక్టులు ప్రారంభం
ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు చేరేలా చూడడంలో బీహార్ ప్రభుత్వం ఆదర్శప్రాయమని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు...
ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు చేరేలా చూడడంలో బీహార్ ప్రభుత్వం ఆదర్శప్రాయమని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. గత 15 ఏళ్లలో బీహార్ రాష్ట్రంలో సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోబట్టే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరాయని అని ఆయన అన్నారు. రూ .900 కోట్లకు పైగా ఖర్చుతో బీహార్‌లో మూడు పెట్రోలియం ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులలో పారాడిప్-హల్దియా-దుర్గాపూర్ పైప్‌లైన్.. అలాగే ఆగ్మెంటేషన్ ప్రాజెక్టులోని దుర్గాపూర్-బంకా విభాగం.. ఇలా మూడు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) బాట్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి.. అని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది.
ఈ రెండు ఎల్‌పిజి ప్లాంట్లు బీహార్ కే కాకుండా జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలకు కూడా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయగలవాని నరేంద్ర మోదీ తెలిపారు. వర్చువల్ గా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీహార్ సిఎం నితీష్ కుమార్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీహార్ డిప్యూటీ సిఎం సుశీల్ మోదీ తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రంలో ఇంధన సంబంధిత ప్రాజెక్టులన్నింటినీ అభివృద్ధి చేయడంలో కేంద్రం విస్తృతంగా కృషి చేసిందని ప్రధాని మోదీ అన్నారు. బీహార్ యువతలో విద్యావ్యవస్థ ప్రతిభను పెంపొందించేలా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్రంగా కృషి చేశారని ప్రధాని మోడీ ప్రశంసించారు.