గుజరాత్ కేవాడియాలో 8 రైళ్లను ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ
గుజరాత్ కేవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని దేశంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానించే 8 రైళ్లను ప్రారంభించారు
గుజరాత్ కేవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని దేశంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానించే 8 రైళ్లను ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోడీ. కొత్త రైళ్ల ప్రారంభంతో… స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసేందుకు వచ్చే పర్యాటకులకు ప్రయాణం మరింత సులువవుతుంది. గుజరాత్‌లోని గిరిజన ప్రాంతమైన కెవాడియాలో పర్యాటకానికి ఊతమివ్వడానికి, స్టాట్యూ అఫ్ లిబర్టీకి ప్రపంచ నలుమూలల నుంచి కనెక్టివిటీ సదుపాయం కల్పించడానికి వీలుగా ఈ రైళ్లను ప్రారంభించినట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. దీంతో ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయని మోడీ పేర్కొన్నారు.
భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోడీ.. 2018 అక్టోబర్‌లో పటేల్ భారీ విగ్రహం స్టాట్యూ ఆఫ్ లిబర్టీని నర్మదా నది ఒడ్డున, కెవాడియా పట్టణం సమీపాన ఆవిష్కరించారు. కొత్తగా ప్రారంభమైన ఈ ఎనిమిది రైళ్లు కెవాడియా-వారణాసి, కెవాడియా-దాదర్, కెవాడియా-అహ్మదాబాద్, కెవాడియా-హజ్రత్, కెవాడియా-నిజాముద్దీన్, కెవాడియా-రేవా, కెవాడియా-చెన్నై, కెవాడియా-ప్రతాప్‌నగర్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి.