PM Modi: కన్యాకుమారిలో ముగిసిన ప్రధాని మోడీ ధ్యానం
PM Modi: ప్రధాని మోడీ కన్యాకుమారిలో చేపట్టిన 45 గంటల ధ్యానం శనివారం(జూన్1)మధ్యాహ్నం ముగిసింది.
PM Modi: ప్రధాని మోడీ కన్యాకుమారిలో చేపట్టిన 45 గంటల ధ్యానం శనివారం(జూన్1)మధ్యాహ్నం ముగిసింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌లో ఆయన ధ్యానం చేశారు. గురువారం సాయంత్రం 6.45 నిమిషాలకు ప్రధాని మోడీ ధ్యానంలో కూర్చున్నారు. ధ్యాన సమయంలో ఆయన కేవలం ద్రవ పదార్థాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 45 గంటల పాటు మోడీ మౌనంగానే ఉన్నారు.
కాషాయ దుస్తులు, జపమాలతో ధ్యాన మండపంలో ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్న మోడీ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం ధ్యానం ముగిసిన తర్వాత ఆయన వివేకానంద రాక్ మెమోరియల్ పక్కనే ఉన్న తమిళ కవి తిరువల్లూరు విగ్రహానికి పూలమాల వేసి నమస్సుమాంజలి అర్పించారు.