Petrol Price: 12వ రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Price: వరుసగా 12వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2021-02-20 04:09 GMT

12 వ రోజూ పెరిగిన పెట్రోల్ ధరలు (ప్రతీకాత్మక చిత్రం)

Petrol Price: వరుసగా 12వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి పెట్రోధరల పెరుగుదల రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో వరుసగా 12 రోజు అంటే ఈరోజు(శనివారం)కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుపై 35 పైసలు పెరగగా, పెట్రోధరల పెరుగుదల రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

దేశరాజధాని ఢిల్లీలో వరుసగా 12 రోజు అంటే ఈరోజు(శనివారం)కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర 39 పైసలు పెరిగి... లీటర్ రూ.90.58కి చేరగా. డీజిల్ కూడా 37 పైసలు పెరిగి లీటర్ రూ.80.97కి పెరగ్గా ముంబైలో పెట్రోల్ ధర 38 పైసలు పెరిగి... లీటర్ రూ.97కి చేరగా డీజిల్ 39 పైసలు పెరిగి లీటర్ రూ.87.06కి చేరింది. బెంగళూరులో పెట్రోల్ ధర ఏకంగా రూ.1.30 పెరిగి... లీటర్ రూ.93.67కి చేరింది. డీజిల్ 10 పైసలు పెరిగి లీటర్ రూ.85.84కి చేరింది. చెన్నైలో పెట్రోల్ 34 పైసలు పెరిగి లీటర్ రూ.92.59కి చేరగా... డీజిల్ 35 పైసలు పెరిగి లీటర్ రూ.85.98కి చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ 37 పైసలు పెరిగి లీటర్ రూ.97.78కి చేరగా... డీజిల్ 37 పైసలు పెరిగి లీటర్ రూ.84.56కి చేరింది.దీంతో సాధారణ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అసలే కరోనా అవస్థలు పడుతుంటే పెట్రో బాదుడుతో పెనం నుంచి పొయ్యిలో పడినట్లుందని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెరిగే ధరలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నా… కేంద్రం పట్టించుకోవట్లేదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తలచుకుంటే ధరలను తగ్గించవచ్చు. పన్నులు తగ్గిస్తే… ధరలు తగ్గుతాయి. కానీ కేంద్రం అలాంటి ఆలోచనలో ఉన్నట్లు కనిపించట్లేదు. డీజిల్ ధర పెంపుతో… నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు గ్యాస్ బండ ధరను ఆల్రెడీ పెంచారు. అందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 

Tags:    

Similar News