దేశంలో నిలకడగా పెట్రో , డీజిల్ ధరలు ..
* గత 23 రోజులుగా ఇంధన ధరలు స్థిరం.. * నవంబర్ 20 నుంచి 17 సార్లు పెరిగిన ఇంధన ధరలు.. * ఫలితంగా మెట్రో నగరాల్లో పెట్రో ధరల భగభగలు ..
దేశంలో పెట్రో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని మెట్రోనగరాల్లో గత 23 రోజులుగా ఇంధన ధరలు స్థిరంగా వుండటంతో వాహనదారులకు ఉపశమనం లభించినట్లయింది.అయితే నవంబర్ 20 నుంచి ఇప్పటివరకు దాదాపు 17 సార్లు ధరల సమీక్ష నిర్వహించడంతో పెట్రో భగభగలు కొనసాగుతున్నాయి. ధరల సవరణలో భాగంగా ఇప్పటికే రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 2 రూపాయల 65 పైసలు, డీజిల్ ధర 3 రూపాయల 40 పైసలు చొప్పున పెరిగాయి. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 87రూపాయల 06 పైసలు.డీజిల్ ధర లీటర్ 80.60 పైసల వద్ద కొనసాగుతున్నాయి.