Patanjali: చిక్కుల్లో రాందేవ్ బాబా... శాకాహార ఉత్పత్తిలో చేపల ఆనవాళ్ళు

Patanjali product: ఇప్పటికే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పతంజలి ఆయుర్వేద లిమిటెడ్..మళ్లీ చిక్కుల్లో పడింది. వాస్తవానికి, పతంజలి శాఖాహార ఉత్పత్తులలో ఒకదానిలో చేపల నుండి పొందిన సమ్మేళనం ఉందని ఆరోపిస్తూ..ఓ పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చింది.

Update: 2024-08-31 03:02 GMT

Patanjali product : చిక్కుల్లో రాందేవ్​ బాబా..ఓ పతంజలి ప్రాడెక్టులో చేపలకు సంబంధించిన మూలాలు

Patanjali product: యోగా గురు రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్ కు మరోసారి చిక్కుల్లో పడింది. పతంజలి కంపెనీకి చెందిన దంత సంరక్షణ ఉత్పత్తి అయిన దివ్య దంత్ మంజన్‌ను తప్పుగా బ్రాండింగ్ చేశారని ఆరోపించిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పతంజలి నుండి ప్రతిస్పందనలను కోరింది.దీనికి సంబంధించి, న్యాయవాది యతిన్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌లో, పతంజలి దివ్య టూత్‌పేస్ట్‌ను గ్రీన్ డాట్‌తో మార్కెట్ చేస్తుందని పేర్కొన్నారు. అంటే ఈ ఉత్పత్తిని తయారు చేయడంలో శాకాహార పదార్థాలను మాత్రమే ఉపయోగించారు. కానీ, ఇందులో సీఫోమ్ అనే పదార్ధం ఉంటుంది. ఇది వాస్తవానికి సముద్ర చేపల నుంచి పొందిన సమ్మేళనమని గుర్తించారు.

డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ ప్రకారం ఇది తప్పుడు బ్రాండింగ్ కిందకు వస్తుందని న్యాయవాది యతిన్ శర్మ పేర్కొన్నారు. వాస్తవానికి ఔషధాలకు శాఖాహారం లేదా మాంసాహారం అని నిర్దిష్ట లేబుల్ వేయాల్సిన అవసరం లేదన్నారు. కానీ గ్రీన్​ డాట్​ని ఉపయోగించడం డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం ప్రకారం "తప్పుడు బ్రాండింగ్" కిందకు వస్తుందంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సంజీవ్ నరులా కేంద్రం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐతో పాటు పతంజలి, రామ్‌దేవ్, దివ్య ఫార్మసీ తదితర సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేశారు. పతంజలి ఉత్పత్తుల్లో చేపల ఆధారిత సమ్మేళనాలు ఉండడం తనకు, తన కుటుంబ సభ్యులకు బాధకారంగా మారిందన్నారు. రెస్పాండెంట్ నెం.3 తమ అధికారిక వెబ్​సైట్​లో గ్రీన్​ డాట్​తో ఉత్పత్తిని విక్రయిస్తోందని, ఇది శాకాహారి అని సూచిస్తుందని, లోపల ఉన్న ఇంగ్రీడియెంట్స్​తో చూస్తే ఇది విరుద్దంగా ఉందంటూ పేర్కొంది.

Tags:    

Similar News