Oxford Covid Vaccine Human trials in India: భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్

Oxford Covid Vaccine Human trials in India: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థల సంయుక్తంగా రూపొందించిన క‌రోనా వ్యాక్సిన్ ఫైనల్‌ ట్రయల్స్‌కు రంగం సిద్ధం చేసుకున్నాయి.

Update: 2020-07-28 07:36 GMT
Oxford Covid vaccine final phase of human trials in india

Oxford Covid Vaccine Human trials in India: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థల సంయుక్తంగా రూపొందించిన క‌రోనా వ్యాక్సిన్ ఫైనల్‌ ట్రయల్స్‌కు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఈ ఫైనల్‌ స్టేజ్‌ (మూడో దశ) ట్రయల్స్‌ను మన దేశంలో కూడా నిర్వహించనున్నారు. మొత్తం ఐదు చోట్ల ఈ ట్రయల్స్‌ చేపట్టనున్నారు. ఈ మేరకు సదరు వర్సిటీ, సంస్థలతో వ్యాక్సిన్ ఉత్పత్తికి భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తో ఒప్పందం చేసుకున్న‌ది. ఈ మేర‌కు ఆ 5 ప్రాంతాలను ఎంపిక చేసింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ సదరు ప్రాంతాల వివరాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి అందజేసింది. ఈ విష‌యాన్ని బయోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్ సెక్ర‌ట‌రీ రేణూ స్వ‌రూప్ తెలిపారు. ఇక భార‌త్‌లో ఎలాంటి కరోనా వ్యాక్సిన్‌ టెస్టులు జరిగినా.. అందులో డీబీటీ భాగస్వామ్యం ఉంటుందని బయోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్ సెక్ర‌ట‌రీ తెలిపారు. నిధులు, రెగ్యులేట‌రీ క్లియ‌రెన్సులు, విభిన్న నెట్వ‌ర్క్‌ల‌కు అనుమ‌తి ఇవ్వడం వంటి అంశాలన్నీ బ‌యోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్‌కు చెందుతాయన్నారు. ఆక్స్‌ఫ‌ర్డ్ ఫైనల్‌ స్టేజ్‌ క్లినికల్ ట్రయల్స్‌కు సైట్ల‌ను సిద్ధం చేసే పనిలో డీబీటీ ఉన్నట్లు స్వరూప్‌ తెలిపారు. ఈ క్రమంలో ఆగస్టు చివరి వరకు ఆయా ప్రాంతాల్లో ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్‌కు ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమవుతాయి.

తొలి రెండు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు చెందిన రిపోర్టులను ఇప్పటికే విడుదల చేశారు. ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్‌కు ఏప్రిల్‌, మే నెలల్లో యూకేలో మొదటి దశలో 1077 మందిపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు. ఈ క్రమంలో వారిలో 56 రోజుల తరువాత కూడా కరోనా వైరస్‌కు యాంటీ బాడీలను గుర్తించారు. ఈ నేప‌థ్యంలో ఫేజ్ 3 ట్రయల్స్ ప్రారంభం కాగానే 300 మిలియన్ల డోసులను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుంది. ఆ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసే కరోనా వ్యాక్సిన్ డోసుల్లో సగం డోసులను నెల నెలా భారత్‌కే కేటాయిస్తామని ఇప్పటికే తెలిపారు. ఈ క్రమంలో సెప్టెంబర్ చివరి నాటికి వ్యాక్సిన్ ప్రజా పంపిణీకి సిద్ధమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక భారత్‌లో మొత్తం 5వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చి ఫేజ్ 3 ట్రయల్స్ చేపట్టనున్నారు. 

Tags:    

Similar News