Manda Krishna Madiga: మా 30 ఏళ్ల పోరాటం ఫలించింది.. చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు.
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. తమ 30 ఏళ్ల పోరాటం ఫలించిందన్నారు. వర్గీకరణ కోసం పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులకు ఈ విజయం అంకితం చేస్తున్నట్టు తెలిపారు మందకృష్ణ. వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాల నియామక ప్రక్రియ నిలిపివేయాలని.. వర్గీకరణ తర్వాత రీ షెడ్యూల్ చేయాలని కోరారు.
చంద్రబాబు సీఎంగా ఉండడం వల్ల ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని మందకృష్ణ మాదిగ విశ్వాసం వ్యక్తం చేశారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసిన చంద్రబాబే.. ఈనాడు తీర్పు వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు, విద్యావకాశాలు మాకు వచ్చేవి కాదు. ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లే మాకు ఈనాడు న్యాయం జరిగిందని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ రేవంత్ రెడ్డి రిజర్వేషన్లలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. తమ పోరాటానికి సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.