దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఎక్కడో ఒక చోట నిత్యమూ మహిళలు, బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు చోటు చేసుకుంటునే ఉన్నాయి. దేశంలో 1994, 2016 మధ్య కాలంలోనే బాలికలపై అత్యాచారాలు నాలుగింతలు పెరిగాయనే చేదు నిజం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే బాలికలపైనే అత్యాచారాలు జరుగుతున్నాయి అనుకుంటే అభం శుభం తెలియని 35 మంది చిన్నారులతో సహా ఏకంగా 40 మంది పురుషులు, ట్రాన్స్ జెండార్లపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాపిశాచి. ఇక వివరాల్లోకి వెళితే జైపూర్ లోని శాస్త్రీనగర్ కు చెందిన ఏడేళ్ల చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయమై చిన్నారి తలిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదే చేసుకొని విచారణ చేపట్టారు పోలీసులు. అయితే నిందితుడు(35) ముసుగు ధరించడంతో సీసీ కెమెరాల్లో కూడా నిందితుడి ఆచూకి లభ్యం కాలేదు కానీ అతని బైక్ ను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా లోతుగా విచారణను ముమ్మరం చేశారు. అయితే గతంలో కూడా అత్యాచార ఘటనల్లో ఇదే బైక్ ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు.
కాగా మూడు రోజుల క్రీతం అదే బైక్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతన్ని కస్టడిలోకి తీసుకున్న పోలీసులకు నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. విచారణ చేపట్టిన సీనియర్ పోలీసు అధికారిని శ్రీవాత్సవ మాట్లాడుతూ కేవలం బైక్ ఆధారంగా అతన్ని చేధించాం. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిన సమయంలో ఇలాంటి బైక్ ఆనవాళ్లే గుర్తించమన్నారు. దీంతో ఆ కోణంలో నిందితుడిని విచారించాం. తంలో ఈ కామాంధుడు 35 మంది చిన్నారులు, 40 మంది పురుషులు, ట్రాన్స్‌జెండర్లపై అత్యాచారానికి పాల్పడ్డాడని సీనియర్ పోలీసు అధికారి శ్రీవాత్సవ తెలిపారు. నిందితుడు చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేసే వాడు. మద్యం, సెక్స్‌కు బానిసైన ఈ వ్యక్తి పురుషులు, ట్రాన్స్‌జెండర్లు అనే తేడా లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం' అని పోలీసులు అధికారి శ్రీవాత్సవ మీడియాకు తెలిపారు.