పులికాట్ సరస్సులో మరోసారి పడవ మొరాయింపు... ఆందోళనకు గురైన 60 మంది ప్రయాణికులు

* ఆందోళనకు గురైన 60 మంది ప్రయాణికులు

Update: 2022-11-22 07:35 GMT

పులికాట్ సరస్సులో మరోసారి పడవ మొరాయింపు... ఆందోళనకు గురైన 60 మంది ప్రయాణికులు

Pulicat Lake: ఓ పక్క చలి మరో పక్క అలల ఉధ్రుతి ఆపై చినుకులుగా రాలుతున్న వర్షం నడుమ బయల్దేరిన ఆ పడవ పులికాట్‌ సరస్సు నడిమధ్యలో నిలిచిపోయింది. దీంతో అందులో వున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తిరుపతి జిల్లా తడ మండలం ఇరకం దీని నుంచి భీములవారిపాళేనికి ఓ పడవ బయలుదేరింది. సాయంత్రం సుమారు 60 మంది విద్యార్థులతో కలసి ఆ బోట్‌ తిరిగి ఇరకం దీవికి బయల్దేరింది. మార్గమధ్యంలో ఇంజన్‌కు వచ్చే రెక్కలు తిరక్కపోవడంతో పడవ ఒక్కసారిగా సరస్సులో నిలిచిపోయింది.

మార్గమధ్యంలో నాటు పడవ ఆగిపోవడం ఆ ప్రాంతంలో సెల్‌ఫోన్లల్లో సిగ్నల్ లేకపోవడంతో, విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు హైరానా పడ్డారు. ఆపై కొందరు మరో రెండు నాటు పడవల్లో విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. ఇరకం దీవిలో పదేపదే నాటు పడవలు మొరారించడం విద్యార్థులు, ప్రజలు ఆందోళనలకు గురికావడం నిరంతర ప్రక్రియగా మారిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేక బోట్లను నడపాలని, ప్రమాదాల నుంచి తమను కాపాడాలంటూ దీవుల్లో ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News