Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణస్వీకారం

Omar Abdullah: జమ్ముకశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు.

Update: 2024-10-16 07:05 GMT

Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణస్వీకారం

Omar Abdullah: జమ్ముకశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఒమర్ అబ్దుల్లా చేత లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీన‌గ‌ర్‌లోని ‘షేర్ యే క‌శ్మీర్ ఇంట‌ర్నేష‌న‌ల్ కాన్ఫరెన్స్ సెంట‌ర్‌’లో ఈ ప్రమాణ‌స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌- కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్‌సీ శాసనసభాపక్ష నేతగా ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలంటూ ఎన్‌సీతోపాటు కాంగ్రెస్‌ నుంచి ఎల్‌జీకి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఈ రోజు కొత్త ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణస్వీకారానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆహ్వానించడంతో ఈ కార్యక్రమం జరిగింది.

Tags:    

Similar News