కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు మంచి జరిగితే రోడ్లపై చలిలో ఎందుకు ధర్నాలు చేస్తారని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశం కోసం రోజుంత కష్టపడుతున్న వారికి నష్టం చేకూర్చే విధంగా కొత్త చట్టాలు తెచ్చారన్నారు. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ప్రధాని మోడీ అబద్ధం చెప్పారన్నారు. మోడీ మిత్రులకు లాభం చేకూర్చేందుకు ఈ బిల్లులను తీసుకొచ్చారని మండిపడ్డారు. రైతుల శక్తి ముందు ఎవరూ నిలబడలేరని రాహుల్ గాంధీ అన్నారు. రైతులు దేనికి భయపడరని చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు.