ఒకే విమానంలో ఢిల్లీకి నితీశ్‌, తేజస్వి.. కీలక భేటీల వేళ ఆసక్తికర పరిణామం

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఇటు ఎన్డీయే కూటమి.. అటు ఇండియా కూటమి తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.

Update: 2024-06-05 08:15 GMT

ఒకే విమానంలో ఢిల్లీకి నితీశ్‌, తేజస్వి.. కీలక భేటీల వేళ ఆసక్తికర పరిణామం

Delhi: ఇవాళ ఎన్డీయే కూటమి భాగస్వామ్యపక్షాల సమావేశం జరగనుంది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు హాజరుకానున్నాయి. పదేళ్ల విరామం తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు, ఎన్డీయే పక్షనేత ఎంపికపై చర్చ జరగనుంది. సమావేశానికి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, నితీష్ కుమార్, తేజస్వీయాదవ్, ఎన్డీయే భాగస్వామ్యపక్షనేతలు హాజరుకానున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది.

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఇటు ఎన్డీయే కూటమి.. అటు ఇండియా కూటమి తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. మెజార్టీ ఎన్డీయేకే ఉన్నప్పటికీ.. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందకు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే తనకు కావాల్సిన బలానికి ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్యపక్షాలకు ఎర వేస్తున్నారు. ముఖ్య నేతలతో బ్యాకెండ్‌లో చర్చలు.. సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది.

కాగా.. ఇప్పటికే ఎన్డీయేకి మద్దతు తెలపడానికి నితీష్ కుమార్ వెళ్లగా... అతని వెంట.. తెజస్వీ యాదవ్ కూడా బయలుదేరారు. అయితే.. నితీష్ కుమార్ వెనక్కి రావాలని... ఇండియా కూటమిలో భాగస్వామ్యం కావాలని RJD ఎమ్మెల్యే వీరేంద్ర అప్పీల్ చేస్తున్నారు. ఇప్పుడు తేజస్వీయాదవ్ సైతం నితీష్ కుమార్ తో వెల్లడమే ఆశ్చర్యం కల్గిస్తోంది. 

Tags:    

Similar News