Union Budget: రేపు కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సీతారామన్

Union Budget: 8 నెలలకు గాను బడ్జెట్‌ను రూపొందించిన కేంద్రం

Update: 2024-07-22 10:09 GMT

Union Budget: రేపు కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సీతారామన్

Union Budget: దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో మంగళవారం ప్రవేశపెట్టనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో ఓటాన్ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో NDAకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో సామాన్యులకు వరాలు కురిపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మౌలిక సదుపాయాలను పెంచడం నుంచి సామాజిక సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడం, పన్ను విధానాలను మార్చడం, ద్రవ్య లోటును తగ్గించడం మొదలైనవి ఆశాజనకంగా ఉండనున్నాయి. వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనతను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సాధించబోతున్నారు. ఎక్కువసార్లు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు సైతం ఆమె పేరిట ఉంది.

Tags:    

Similar News