100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై మోడీ సమావేశం

కాబోయే మంత్రులకు ప్లాన్ వివరించిన మోడీ

Update: 2024-06-09 11:30 GMT

100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై మోడీ సమావేశం

కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువుదీరడానికి ముందే 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో కాబోయే కేంద్రమంత్రులకు 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను వివరించారు ప్రధాని మోడీ. యాక్షన్ ప్లాన్ అమలు కోసం 10 మంది కేంద్ర కార్యదర్శులతో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యాక్షన్ ప్లాన్‌లో కీలక అంశాలను పొందుపర్చారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే ఓటరు జాబితా అమలుపై చర్చ చేయనున్నారు. యూపీఎస్సీ సిలబస్, పరీక్ష విధానం మార్పు, సివిల్ సర్వెంట్లకు పనితీరు ఆధారంగా రేటింగ్ ఇచ్చే అంశంపై చర్చిస్తారు. 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో తయారీ, సేవల రంగ విస్తరణ కోసం 10 కొత్త సిటీలు ఏర్పాటు చేయనున్నారు. అటు హోమ్‌లోన్‌పై వడ్డీతో కూడిన రాయితీ అందించే అంశంపై ఫోకస్ పెట్టనున్నారు. బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేకపోయిన వారికి ఊరట కోసం చర్యలు చేపట్టనున్నారు.

Tags:    

Similar News