Modi speech in UNO: 150 దేశాలకు సహాయం చేశాం : ప్రధాని మోదీ

Modi speech in UNO: కరోనా కాలంలో 150 దేశాలకు సహాయం చేశామని ప్రధాని మోడీ చెప్పారు.

Update: 2020-07-18 01:52 GMT

Modi speech in UNO  ఐక్యరాజ్యసమితి (యుఎన్) సమావేశంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్బంగా కరోనాను ఎదుర్కొంటున్న తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. కరోనా కాలంలో 150 దేశాలకు సహాయం చేశామని.. సార్క్ కోవిడ్ ఫండ్ సృష్టించబడిందని. ప్రభుత్వ ప్రయత్నాలను ప్రజలతో అనుసంధానించామని.. దీంతో కరోనాపై యుద్ధాన్ని బహిరంగ ప్రచారంగా చేశామని అన్నారు.

ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి 75 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నామన్న మోదీ.. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పడిన 50 మంది వ్యవస్థాపక సభ్యులలో భారతదేశం కూడా ఉందని.. నేడు యుఎన్ 193 దేశాలను ఏకతాటిపైకి తెచ్చిందని అన్నారు. దీంతో ఐరాస నుంచి అంచనాలు కూడా పెరడగం తోపాటు చాలా సవాళ్లు కూడా ఉన్నాయని అన్నారు.

2030 ఎజెండా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు తమ ప్రభుత్వం దోహదం చేస్తుందని అన్నారు. ప్రపంచ జనాభాలో భారతదేశం ఆరవ వంతు జనాభాను కలిగి ఉందని. మా బాధ్యత ఏమిటో మాకు తెలుసని అన్నారు. భారతదేశం అనుకున్న ఆర్థిక లక్ష్యాలను సాధిస్తే, అది ప్రపంచ లక్ష్యాల నెరవేర్పునకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.

కాగా ఐక్యరాజ్యసమితి 75 వ వార్షికోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. ఈ ఏడాది జూన్‌లో, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ (యుఎన్‌ఎస్‌సి) లో తాత్కాలిక సభ్య దేశంగా భారతదేశం ఎన్నికైంది. దీని తరువాత, మోడీ ఇలాంటి కార్యక్రమంలో మాట్లాడటం ఇదే మొదటిసారి.

ఈ సమావేశాన్ని ప్రతి సంవత్సరం UN యొక్క ఆర్థిక మరియు సామాజిక మండలి (UN ECOSOC) నిర్వహిస్తుంది. ఇందులో సీనియర్ ప్రభుత్వ అధికారులతో పాటు ప్రైవేటు రంగం, పౌర సమాజం మరియు విద్యా రంగానికి చెందిన ప్రతినిధులు ఉంటారు. 2016 లో ఈ కౌన్సిల్ 70 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ కూడా ఇంతకుముందు ప్రసంగించారు. 

Tags:    

Similar News