Moderna Coronavirus Vaccine: కోతుల్లో కరోనా‌ను నిలువరించిన మోడెర్నా టీకా

Update: 2020-07-30 08:10 GMT

Moderna Coronavirus Vaccine: కరోనా వైరస్ ని అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ ని కనిపెట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే అమెరికా సంస్థ 'మోడెర్నా' గుడ్ న్యూస్ చెప్పింది. 'ఎంఆర్‌ఎన్‌ఏ1273'గా పిలిచే ఈ వ్యాక్సిన్ తొలి దశ ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చినట్లు ఇప్పటికే తేలింది. దీంతో అమెరికా సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మూడో దశ క్లినియల్ ట్రయల్స్ ప్రారంభించారు. వైరస్‌‌ను నిర్వీర్యం చేసే బలిష్టమైన ప్రతిస్పందన వ్యవస్థను ఈ వ్యాక్సిన్ సృష్టించిందని మోడెర్నా సంస్థ తెలిపింది. అంతే కాదు కోతుల్లో కరోనా వైరస్ ను ఈ వ్యాక్సిన్ నిలువరించగలుగుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడయ్యిందని కూడా ప్రకటించింది. కోతుల్లోని దిగువ, ఎగువ శ్వాసనాళాల్లో కరోనాను నియంత్రించిందని పేర్కొంది. ఈ సంస్థ తాజాగా చేసిన అధ్యయనం ప్రకారమే వ్యాక్సిన్ పనితీరును ధ్రువీకరించింది. కరోనా బారిన పడి కోలుకున్న వారిలో ఉత్పన్నమవుతున్న యాంటీబాడీలతో పోలిస్తే వ్యాక్సిన్ పొందిన కోతుల్లోనే అధిక సంఖ్యలో యాంటీబాడీలు ఉత్పత్తయినట్లు నిర్ధరించారు.

ఈ వ్యాక్సిన్ ని ప్రయోగించడానికి గాను పరిశోధకులు 24 రీసస్ కోతులను మూడు బృందాలుగా విడగొట్టారు. ఈ మూడు బృందాల్లో ఓ బృందం కోతులకు టీకా ఇవ్వలేదు. మిగతా రెండు బృందాల్లో ఓ బృందం కోతులకు 10 మైక్రోగ్రాముల డోస్, మరో బృందానికి 100 మైక్రోగ్రాముల డోస్ ఇచ్చారు. ఈ టీకా ఇచ్చిన కోతులు కరోనా వైరస్ బారిన పడ్డప్పటికీ వాటిలో వైరస్‌ శాతం పెరగలేదని పరిశోధకులు గుర్తించారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో పరిశోధకులు తాజాగా చేసిన ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించారు.

జంతువులలో పరిశోధన ఫలితాలతో వ్యాక్సిన్‌పై మరింత నమ్మకం ఏర్పడింది. దీంతో ఈ సంస్థ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో 30వేల మంది వాలంటీర్లను ఎంచుకున్నారు. వారందరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ ప్రయోగంలో వ్యాక్సిన్ సానుకూల ఫలితాలు ఇస్తే ఈ ఏడాది చివరినాటికి రెగ్యులేటరీ ఆమోదం, విస్తృతమైన ఉపయోగం కోసం మార్గాన్ని సుగమం చేస్తాయి. వ్యాక్సిన్ అభివృద్ధికి మోడెర్నాకు అమెరికా దాదాపు ఒక్క బిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం చేయడంతో ఇది మార్కెట్‌లో తొందరగా అందుబాటులోకి రాకపోవచ్చు.

ఆస్ట్రాజెన్‌కా కోవిడ్ వ్యాక్సిన్‌పై కూడా ఇలాంటి ప్రయోగమే నిర్వహించారు. మానవ ప్రయోగ పరీక్షలలో ఆస్ట్రాజెన్‌కా, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అత్యంత అధునాతనమైనది. ఆయా సంస్థలు జంతువులపై చేసిన అధ్యయనంలో కూడా ఊపిరితిత్తులకు నష్టం జరగకుండా వైరస్‌ను నిరోధించింది. కానీ, వైరస్ ఇప్పటికీ ముక్కులో చురుకుగా ఉన్నట్టు తేల్చింది.




Tags:    

Similar News