కోవిడ్ వ్యాక్సినేషన్‌‌లో మరో మైలురాయి అధిగమించిన ఇండియా

Covid Vaccine: కరోనాకు వ్యతిరేకంగా కొనసాగుతున్న టీకా డ్రైవ్‌లో భారత్‌ మరో మైలురాయిని అధిగమించింది.

Update: 2021-06-13 04:39 GMT

Crore Covid-19 Vaccine:(File Image)

Covid Vaccination in India: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్లు ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. కరోనావైరస్‌కు కళ్లెం వేసేందుకు భారత్‌లో వ్యాక్సినేషన్ జరుగుతోంది. మూడు వ్యాక్సీన్లకు భారత్ ఆమోదం తెలిపింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వీటిలో మొదటిది. దీన్ని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. భారత సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ రెండోది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ మూడోది.

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి గజగజ వణికిణ భారత్ ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య కొంతమేర తగ్గుముఖం పడుతోంది. నిత్యం లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. కాగా.. ఇటీవల నమోదవుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దేశంలో ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కరోనాకు వ్యతిరేకంగా కొనసాగుతున్న టీకా డ్రైవ్‌లో భారత్‌ మరో మైలురాయిని అధిగమించింది. శనివారం నాటికి టీకా డ్రైవ్‌ 148వ రోజుకు చేరింది. ఇప్పటివరకు 25,28,78,702కు పైగా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో 20,46,01,176 తొలి టీకా డోసులు వేసి మరో మైలురాయిని అధిగమించినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.

శనివారం ఒకే రోజు మొత్తం 31,67,961 వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు చెప్పింది. ఇందులో తొలి డోసును 28,11,307 మంది లబ్ధిదారులకు వేయగా, మరో 3,56,654 మంది లబ్ధిదారులకు రెండో మోతాదును అందజేసినట్లు తెలిపింది. 18-44 ఏజ్‌ గ్రూప్‌లో 18,45,201 మంది లబ్ధిదారులు మొదటి మోతాదును వేయగా.. 1,12,633 మంది లబ్ధిదారులకు సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ అందించినట్లు పేర్కొంది. కాగా.. థర్డ్ వేవ్ ఉంటుందన్న సూచనలతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తోంది. వ్యాక్సీన్లు ఇస్తున్న ప్రతిచోటా, ఇవి సురక్షితమైనవని ఆయా దేశాల ఔషధ ప్రాధికార సంస్థలు చెబుతున్నాయి. అయితే, కొన్నిచోట్ల చిన్నచిన్న దుష్ప్రభావాలు కనిపిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

Tags:    

Similar News