Kolkata Rape-Murder Case: ఆగస్టు 17న దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న వైద్య సేవలు..సమ్మెకు IMA పిలుపు
Kolkata Rape-Murder Case: బెంగాల్ జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనపై ఆందోళనలు తీవ్రం చేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రెడీ అయ్యింది. దీనిలో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా ఓపీ సేవలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు దేశ రాజధాని రెసిడెంట్ వైద్యుల సంఘాలు ఢిల్లీలో ఉమ్మడి ఆందోళనలకు రెడీ అయ్యాయి.
Kolkata Rape-Murder Case: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య ఘటకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 17న దేశవ్యాప్తంగా సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. ఈ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు పాల్గొంటాయని, ఆగస్టు 17 ఉదయం 6 గంటల నుండి ఆగస్టు 18 ఉదయం 6 గంటల వరకు సమ్మె కొనసాగుతుందని అసోసియేషన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఆసుపత్రులను సేఫ్ జోన్‌లుగా ప్రకటించడంతో పాటు కేంద్ర రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఐఎంఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
బుధవారం రాత్రి కార్ మెడికల్ కాలేజీలో జరిగిన హింసాకాండపై ఐఎంఏ కూడా నిరసన తెలుపనుంది. ఇంతకుముందు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) గురువారం తన నిరసనను కొనసాగించాలని ప్రకటించింది. వైద్య ఉద్యోగులపై దాడులను నిరోధించేందుకు చట్టం తీసుకురావడంతో పాటు వారి డిమాండ్లను నెరవేర్చేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మౌఖిక హామీ ఇవ్వడంతో యూనియన్ తన సమ్మెను విరమించుకుంది. అయితే దీనిని వైద్యులు తీవ్రంగా విమర్శించారు. FORDA నిరసనను మళ్లీ వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. AIIMS, VMMC-సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌తో సహా ఢిల్లీలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల రెసిడెంట్ వైద్యులు సోమవారం ఉదయం ఎలక్టివ్ సేవలను నిలిపివేసి సమ్మెకు దిగారు.
సమ్మెలో ఉన్న వైద్యులు వైద్య కార్మికులకు మెరుగైన భద్రత, భద్రతా చర్యలు, చట్టాలను ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు కూడా శుక్రవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖను చుట్టుముట్టనున్నారు. తమను సంప్రదించకుండానే సమ్మె విరమణ నిర్ణయం తీసుకుందని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (RDA) బుధవారం ఆరోపిస్తున్న తరుణంలో FORDA తాజా నిరసనను ప్రకటించింది. RDA కూడా FORDA వైద్య వర్గాన్ని వెన్నుపోటు పొడిచిందని ఆరోపించింది. వైద్యుల నిరసనల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు నిలిచిపోగా.. ఇప్పుడు ఐఎంఏ ప్రకటన తర్వాత శనివారం నాటికి ఆరోగ్య సేవలు దాదాపుగా నిలిచిపోయే ప్రమాదం ఉంది.