Chhattisgarh: పోలీసుల బేస్‌ క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని పువ్వర్తిలో పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. భద్రతా బలగాలే లక్ష్యంగా శిబిరంపై 20 రౌండ్ల కాల్పులకు తెగబడ్డారు.

Update: 2024-09-14 06:29 GMT

Representational Photo

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని పువ్వర్తిలో పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. భద్రతా బలగాలే లక్ష్యంగా శిబిరంపై 20 రౌండ్ల కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి రాకెట్ లాంఛర్లతో విరుచుకుపడ్డ మావోయిస్టులు అనంతరం కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్ను భద్రతా బలగాలు మావోయిస్టులపై ఎదురుకాల్పులకు తెగబడ్డారు. చీకటి కావడంతో ప్రతిఘటించలేక మావోయిస్టులు అడవిలోకి వెళ్లిపోయారు. దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసు అధికారులు వెల్లడించారు.

కాగా శనివారం తెల్లవారుజాము నుంచి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ఆపరేషన్‌ చేపట్టాయి. బస్తర్‌ ఫైటర్లు, డీఆర్జీ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొని మావోయిస్టుల కోసం వేట సాగించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలంలో పెద్దఎత్తున ఆయుధాలు, మావోయిస్టుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News