Shelly Oberoi: ఢిల్లీలో పలు కోచింగ్ సెంటర్లు అక్రమంగా నిర్వహిస్తున్నారు
Shelly Oberoi: భవన నిర్మాణ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు
Shelly Oberoi: ఢిల్లీలో పలు కోచింగ్ సెంటర్లను అక్రమంగా బేస్‌మెంట్స్‌లో నిర్వహిస్తున్నారని మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో శనివారం రాత్రి జరిగిన ఘటన నేపథ్యంలో ఢిల్లీ మేయర్ పలు కోచింగ్ సెంటర్లను సందర్శించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణ చట్టాలను కోచింగ్ సెంటర్ నిర్వాహకులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోచింగ్ సెంటర్ల నిర్వాకంపై బాధ్యులైన అధికారులపైనా చర్యలు ఉంటాయన్నారు.