Delhi Liquor Scam: మనీష్ సిసోడియా విచారణకు అనుమతి
Delhi Liquor Scam: ఫీడ్‌బ్యాక్ యూనిట్ స్నూపింగ్ కేసులో ఆరోపణలు
Delhi Liquor Scam: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను 'ఫీడ్‌బ్యాక్ యూనిట్' స్నూపింగ్ కేసులో ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది హోం మంత్రిత్వ శాఖ. ఎఫ్.బి.యు జాయింట్ డైరెక్టర్ ఆర్ కె సిన్హా, అధికారులు ప్రదీప్ కుమార్ పంజ్, సతీష్ ఖేత్రాలు కూడా ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఫీడ్ బ్యాక్ యూనిట్ 2016 ఫిబ్రవరి నుంచి పనిచేయడం ప్రారంభించింది. దానికోసం రహస్య సేవా వ్యయం కింద కోటి రూపాయలు కేటాయించింది. ఫీడ్ బ్యాక్ యూనిట్ కార్యకలాపాల్లో 60శాతం విజిలెన్స్ వ్యవహారాలు, రాజకీయ నిఘా అయితే 40శాతం మాత్రం ఇంతర అంశాలకు సంబంధించినవని సీబీఐ ఆరోపిస్తోంది.