Kerala: కేరళ సీపీఎం ఆఫీస్‌పై బాంబు దాడి..
CPM Office In Kerala: వయనాడ్ లో రాహుల్ ఆఫీసుపై దాడి జరిగిన తరువాత తాజాగా కేరళలోని సీపీఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి జరిగింది.
CPM Office In Kerala: వయనాడ్ లో రాహుల్ ఆఫీసుపై దాడి జరిగిన తరువాత తాజాగా కేరళలోని సీపీఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఆ విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో స్కూటర్‌పై వచ్చిన ఓ వ్యక్తి పార్టీ ఆఫీస్‌పై బాంబు విసిరాడు. ఈ దృష్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే ఈ దాడిలో ఎవరు గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి కారణం కాంగ్రెస్ నేతలేనని సీపీఎం నేతలు ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది.